Siricilla: పాఠ్యాంశాలను నిత్యం సాధన చేయాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Siricilla: కోనరావుపేట కేజీబీవీని తనిఖీ చేసిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. భోజన నాణ్యత పరిశీలన, విద్యార్థులకు ప్రణాళికాబద్ధమైన చదువుపై సూచనలు.
Siricilla: పాఠ్యాంశాలను నిత్యం సాధన చేయాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ అన్ని పాఠ్యాంశాలను నిత్యం చదవడం, రాయడం సాధన చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. గురువారం కోనరావుపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు.
ముందుగా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం వంటగదిని సందర్శించి మెనూ ప్రకారం భోజనం సిద్ధం చేస్తున్న తీరును పరిశీలించారు. వంటకు వినియోగిస్తున్న కూరగాయలు, బియ్యం, పప్పుల నాణ్యతను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఒక నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకుని అన్ని పాఠ్యాంశాలపై పట్టు సాధించేలా చదవడం, రాయడం నిరంతరం సాధన చేయాలని తెలిపారు. క్రమం తప్పకుండా అభ్యాసం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకునే దిశగా కృషి చేయాలని, భవిష్యత్తులో ఉద్యోగం లేదా స్వయం ఉపాధి రంగంలో స్థిరపడి ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ తనిఖీలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్నిగ్ధ, జీసీడీఓ పద్మజ తదితరులు పాల్గొన్నారు.




