Siricilla: ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరుతో సైబర్ మోసాలు అప్రమత్తత హెచ్చరిక!

Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ట్రేడ్ లైసెన్స్ ఫీజుల పేరుతో వస్తున్న నకిలీ ఫోన్ కాల్స్ పట్ల వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు.

KALEEM, SIRICILLA
Published on: 2 Oct 2026 4:54 PM IST
Siricilla
X

Siricilla: ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరుతో సైబర్ మోసాలు అప్రమత్తత హెచ్చరిక!

Siricilla: సిరిసిల్ల పట్టణంలోని పలువురు వ్యాపారులకు 9124983808 నంబర్ నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ ఫోన్ కాల్స్ వస్తున్నట్లు మున్సిపల్ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సూచించారు.

ట్రేడ్ లైసెన్స్ ఫీజును మున్సిపల్ కార్యాలయంలో లేదా అధికారిక CDMA పోర్టల్ ద్వారా మాత్రమే చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. ఇతర వ్యక్తులకు లేదా తెలియని మొబైల్ నంబర్లకు ఎలాంటి నగదు లేదా ఆన్‌లైన్ చెల్లింపులు చేయవద్దని సూచించారు. CDMA వెబ్‌సైట్‌లో ట్రేడ్ లైసెన్స్ వివరాలు, బకాయిలు, చెల్లింపు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ట్రేడ్ లైసెన్స్ పేరుతో ఇతర నంబర్ల నుంచి అనుమానాస్పద కాల్స్ రావడం, డబ్బులు డిమాండ్ చేయడం లేదా వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు చేయాలని కోరితే ఆ కాల్‌కు సంబంధించిన నంబర్, వివరాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను భద్రపరచి సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

వ్యాపారులందరూ ఈ విషయాన్ని గమనించి అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA