Siricilla: గురువారం ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం ప్రజా పాలన దినోత్సవం. పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించనున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.
Siricilla: గురువారం ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజా పాలన దినోత్సవాన్ని గురువారం నిర్వహించనున్నారు. ఈ నెల 17వ తేదీన జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పరేడ్ గ్రౌండ్‌లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్న ఆయన.. అనంతరం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
ప్రజా పాలన దినోత్సవం నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.




