Siricilla: సిరిసిల్లలో తెలంగాణ ఉద్యమకారుల ప్రత్యేక కార్యాలయం ప్రారంభం

Siricilla: ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యంగా సిరిసిల్ల శివనగర్‌లో జేఏసీ ఆఫీస్ ప్రారంభం. 250 గజాల స్థలం, రూ.25 వేల పెన్షన్ హామీలు నెరవేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి.

KALEEM, SIRICILLA
Published on: 5 Nov 2026 5:18 PM IST
Siricilla
X

Siricilla: సిరిసిల్లలో తెలంగాణ ఉద్యమకారుల ప్రత్యేక కార్యాలయం ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారి హక్కుల సాధన కోసం సిరిసిల్ల పట్టణంలోని శివనగర్‌లో ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సంఘాల రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్మన్ గజ్జల దేవరాజు కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా గజ్జల దేవరాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సమయంలో ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులకు అండగా నిలవడమే కార్యాలయ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం వేదికగా పనిచేస్తుందని, తమ సమస్యలను ఇక్కడ విన్నవించుకోవచ్చని పేర్కొన్నారు. ఉద్యమకారుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని ఆయన అన్నారు. 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్, ఉద్యమకారుల గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీలపై ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ మూడు ప్రధాన హామీలు అమలయ్యే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల జేఏసీ గౌరవాధ్యక్షులు బుస్స వేణు, కుసుమ విష్ణు, కర్నె లక్ష్మి, తెలంగాణ వికాస సమితి జిల్లా కోఆర్డినేటర్ నడిమెట్ల శ్రీనివాస్, బొంపల్లి రవీందర్‌రావు, మాజీ ఏజీపీ బుర్క గోపాల్, అడ్వకేట్ బాబు, మాజీ కౌన్సిలర్ పత్తిపాక పద్మ, వింద్యారాణి, రాచర్ల వెంకట్, బండి దేవదాస్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ గౌడ్, శుభోదయ శ్రీనివాస్ యాదవ్, అన్నారపు రవీందర్, నాయిని ప్రతాప్, మామిడాల రమణ, గుజ్జె దత్తు, లాల దేవ్, చాంద్ పాషా, సింగారం దేవరాజు, తట్టని రణధీర్, వెల్దండి సాగర్‌తో పాటు పలువురు ఉద్యమకారులు, నాయకులు పాల్గొన్నారు. నూతన కార్యాలయం ప్రారంభం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA