Thangallapalli: మండేపల్లి, బద్దెనపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Thangallapalli: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి, బద్దెనపల్లి గ్రామాల్లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
Thangallapalli: మండేపల్లి, బద్దెనపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
రాజన్న సిరిసిల్ల జిల్లా: తంగళ్లపల్లి మండలంలోని మండేపల్లి, బద్దెనపల్లి గ్రామాల్లో ప్రజా ప్రభుత్వం అందజేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ గాధగొని సాగర్, చిలువేరు లావణ్య–చిరంజీవితో కలిసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిగేల రాజు లబ్ధిదారులకు కార్డులు, చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారని, ప్రజా ప్రభుత్వానికి గ్రామ ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ టోనీ, గుగిళ్ళ శ్రీకాంత్ గౌడ్, ప్రశాంత్, హారిక, కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుగ్గిళ్ళ భరత్ గౌడ్, అభి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల తిరుపతి, ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సందీప్, శ్రీనివాస్ గౌడ్, సత్యం, మల్లేష్, నరేష్, శ్రీధర్, లక్ష్మణ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




