Karimnagar: కేవీపీఎస్ సెమినార్: కుల వ్యవస్థ రద్దుపై సీనియర్ నేతల పిలుపు!

Karimnagar: కరీంనగర్‌లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో '78 ఏళ్ల స్వాతంత్ర్యం - సామాజిక న్యాయం' సెమినార్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 9 Aug 2026 6:39 PM IST
Karimnagar
X

Karimnagar: కేవీపీఎస్ సెమినార్: కుల వ్యవస్థ రద్దుపై సీనియర్ నేతల పిలుపు!

కరీంనగర్: వందల ఏళ్ళుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న కులమనే అతి పెద్ద జబ్బును అంతం చేయడం ద్వారానే సామాజిక న్యాయం సిద్ధిస్తుందని జెన్ జీ తరం సామాజిక న్యాయ సాధన కోసం ఉద్యమించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు.

కరీంనగర్ లోని కెవిపిఎస్ ఆధ్వర్యంలో

"78 ఏళ్ల స్వాతంత్ర్యం సామాజిక న్యాయం' అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వడ్లూరి కిషోర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాలలో దళితులపై రోజురోజుకి దౌర్జన్యాలు పెట్రేగిపోతున్నాయని ప్రత్యేకించి ఉత్తర ప్రదేశ్ లో గత పన్నెండ్ల కాలంలో 59 వేల దౌర్జన్యాలు జరిగాయని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న చోట దళితులపై దాడులు దౌర్జన్యాలు ఎక్కువ జరుగుతున్నాయన్నారు.

ఢిల్లీ కేంద్రంగా రిజర్వేషన్ హటావో ఆందోళన చేస్తున్న వారివెనుక ఆర్ఎస్ఎస్ బిజెపి హస్తం ఉందన్నారు. రిజర్వేషన్లకు ప్రధాన కేంద్రంగా ఉన్న కుల వ్యవస్థను రద్దు చేయాలని తద్వారా రిజర్వేషన్ కూడా రద్దు అవుతుందని చెప్పారు. బిజెపి రాజకీయ విధానం దళితులు బలహీన వర్గాలు మైనార్టీలకు వ్యతిరేకంగా ఉంటుందని ఈ వాస్తవాన్ని గ్రహించి బిజెపి మనువాద మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా యువతరం ఐక్యంగా ఉద్యమించాలన్నారు.

బిజెపి విధానాల ఫలితంగా గౌతం ఆదాని ప్రపంచంలో అతిపెద్ద రెండవ కుబేరుడుగా ఒకవైపు ఎదిగితే మరొకవైపున 46 కోట్ల మంది దారిద్ర రేఖకు దిగువన ఉన్నారని చెప్పారు. లక్షల కోట్ల రూపాయలు బడా పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుందని మరోవైపున పేదలపై మోయలేని భారాలు మోపుతుందని విమర్శించారు. అసమాన తల పెరుగుదల దేశ అభివృద్ధికి అడ్డుగా నిలుస్తుందన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర జరుగుతుందన్నారు.

కులాన్ని రద్దు చేసే ధైర్యం కేంద్ర బిజెపి సర్కార్ కు ఉందా అని ప్రశ్నించారు. కుల వివక్ష అంటరానితనం 78 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా కొనసాగడం దేశ పాలకులు సిగ్గుతో తలదించుకోవాలని చెప్పారు. సాటి మనిషిని మనిషిగా ప్రేమించలేని వాళ్లే మత కలహాలు సృష్టించి దేశ ప్రజల ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నారని చెప్పారు. నేటికీ కొనసాగుతున్న కుల వివక్ష అంటరానితనం ఈ దేశ దీనస్థితికి కారణమని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జెన్ జీ ఉద్యమ స్ఫూర్తితో విద్యారంగ పరిరక్షణ ఉపాధి వంటి లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలన్నారు.

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఓవైపు జెన్ జీ ఉద్యమాన్ని బలపరుస్తూనే తమ సంఘ పరివార్ కార్యకర్తలతో మరోవైపున ఆ ఉద్యమంపై అనేక అసత్య ప్రచారాలు సామాజిక మాధ్యమాలలో చేపట్టారని విమర్శించారు. బీజేపీపై వ్యతిరేకత పెరుగుతున్న ప్రతి సందర్భంలో అసంతృప్తి వెలిబుచ్చిన ప్రజలతో ఉన్నట్లు ఆర్ఎస్ఎస్ నటన చేస్తుందన్నారు. రైతాంగ ఉద్యమం విద్యార్థి ఉద్యమాలు బిజెపి పాలకుల మెడలు వచ్చిందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నియంత పాలనకు చోటు లేదన్నారు.

సామాజిక న్యాయం సాధించబడాలంటే భూమి పరిశ్రమలు ప్రకృతి వనరులు అన్నింటిలో ప్రజలకు సహజ న్యాయం జరగడం ద్వారానే సంపూర్ణ సామాజిక న్యాయం సిద్ధించబడుతుందని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సెమినార్ లో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో దళితుల అసైన్డ్ భూములు అన్యాక్రాంతం చేయబడ్డాయని అసైన్డ్ భూములన్నింటికీ తక్షణమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మతవైశ్యమ్యాలు పెరుగుతున్నంత వేగంగా జిల్లా విద్యార్థి యువజనుల విద్యా ఉపాధి అవకాశాలు పెరగటం లేదన్నారు విద్యార్థి యువతరం మతం గతం మూడవిశ్వాసాలు చాందస భావాలు వదిలేసి భవిష్యత్తు కోసం ఉద్యమాలు చేపట్టాలన్నారు ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులు చదువుకోవటం ద్వారా మాత్రమే ఉన్నత శిఖరాల అధిరోహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు గాజుల కనకరాజు, గోవర్ధన్, విజయ ,సుకోసి శ్రీకాంత్, కదాసి కుమార్ ,సదానందం, సంకీర్త్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story