Sircilla: ఆపదలో ఉన్న మహిళను కాపాడిన సిరిసిల్ల పోలీసులకు ఎస్పీ అభినందనలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఫిట్స్‌తో అపస్మారక స్థితిలో పడిపోయిన మహిళను కాపాడిన బ్లూకోట్ కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్ చారి
Sircilla: ఆపదలో ఉన్న మహిళను కాపాడిన సిరిసిల్ల పోలీసులకు ఎస్పీ అభినందనలు!
Sircilla: ప్రజా సేవలో మానవత్వం, విధి నిర్వహణలో నిబద్ధత పోలీసుల అసలైన లక్షణాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. విధులు నిర్వహించడంతో పాటు ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం కూడా పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.
ఇటీవల ఎల్లారెడ్డిపేట మండలంలోని మొదటి బైపాస్ రోడ్డుపై ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలో పడిపోయిన మహిళకు తక్షణ సహాయం అందించి మానవత్వం చాటుకున్న బ్లూకోట్ కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్ చారిలను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేకంగా అభినందించారు. వారి సేవలను గుర్తించి ప్రోత్సాహకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల విధులు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కావని, ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలిచి అవసరమైన సమయంలో తక్షణ సహాయం అందించడం కూడా ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది మానవత్వం, సేవాభావం, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు.
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ, సమయస్ఫూర్తితో స్పందించి ప్రజలకు మెరుగైన సేవలందించే సిబ్బందిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంపొందించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.




