Sircilla: శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా ఉండాలి: ఎస్పీ మహేష్!

Sircilla: ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వార్షిక తనిఖీ చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 5 Sept 2026 5:03 PM IST
Sircilla
X

Sircilla: శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా ఉండాలి: ఎస్పీ మహేష్!

సిరిసిల్ల: వార్షిక తనిఖీల్లో భాగంగా ఎల్లారెడ్డిపేట సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం తనిఖీ చేశారు. పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ.. ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్‌ను పరిశీలించి సిబ్బందిని అభినందించారు.

స్టేషన్‌లో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పెట్రోలింగ్, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలను ఎస్పీ సమీక్షించారు. ప్రజలకు అందిస్తున్న పోలీస్ సేవలపై ఆరా తీసి.. అధికారుల పనితీరును అభినందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ చెల్లింపుల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

డయల్-112కు వచ్చే ప్రతి కాల్‌పై వెంటనే స్పందించి బాధితులకు సత్వర సేవలు అందించాలని, పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని తెలిపారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేష్, ఎస్‌ఐలు రమేష్, శ్రీకాంత్, లక్ష్మణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story