Sircilla: డిజిటల్ పోలీసింగ్‌లో సాంకేతికతను సమర్థవంతంగా వాడాలి: ఎస్పీ!

Sircilla: సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గితే పోలీస్ అధికారులను ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 18 Aug 2026 6:17 PM IST
Sircilla
X

Sircilla: డిజిటల్ పోలీసింగ్‌లో సాంకేతికతను సమర్థవంతంగా వాడాలి: ఎస్పీ!

సిరిసిల్ల: డిజిటల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్ శాఖ వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అధికారులను ఆదేశించారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులకు CCTNS వినియోగం, సైబర్ నేరాల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కేసుల దర్యాప్తులో SOP వినియోగంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా, నాణ్యతతో చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక విధానాలు, ప్రామాణిక కార్యాచరణ పద్ధతులపై అధికారులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ.. CCTNSలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో కేసులు, నేర సమాచారం, ఇతర వివరాల డేటా నమోదును సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు.. దర్యాప్తులో పారదర్శకత, వేగం పెంచేందుకు CCTNS కీలకంగా పనిచేస్తుందని తెలిపారు.

నేరాల నియంత్రణ, నేరస్థుల కదలికలపై పర్యవేక్షణ, కేసుల దర్యాప్తు పురోగతిని సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.

సైబర్ నేరాల దర్యాప్తులో SOPను తప్పనిసరిగా పాటిస్తూ.. CCTNS, NCRP, Samanvay, Sahyog వంటి జాతీయ స్థాయి పోర్టల్స్‌ను సమర్థవంతంగా వినియోగించాలని ఎస్పీ తెలిపారు. పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామాల్లో సైబర్ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

అలాగే POCSO, గ్రేవ్, నాన్-గ్రేవ్, SC/ST అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి.. కోర్టుల్లో సకాలంలో చార్జ్‌షీట్లు దాఖలు చేసి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story