Sircilla: పోలీస్ కార్యాలయంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Sircilla: పోలీస్ కార్యాలయంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు!
సిరిసిల్ల: జయశంకర్ సార్ ఆశయాలే తెలంగాణకు స్ఫూర్తి: ఎస్పీ మహేష్ బి. గితే
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు, సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పేర్కొన్నారు.
ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ మహేష్ బి. గితే, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి చాటిచెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచానికి వివరిస్తూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపిన గొప్ప నాయకుడని అన్నారు.
జయశంకర్ సార్ జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో పోలీస్ శాఖ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఎస్పీ ఆకాంక్షించారు.




