Sircilla: గ్రీవెన్స్ డేలో 29 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ మహేష్ బి.గితే!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే 29 ఫిర్యాదులను స్వీకరించారు.
Sircilla: గ్రీవెన్స్ డేలో 29 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ మహేష్ బి.గితే!
రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే 29 ఫిర్యాదులను స్వీకరించారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి, బాధితుల సమస్యలను చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, బాధితులకు సత్వర న్యాయం అందించడమే గ్రీవెన్స్ డే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి వినతులను స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి చట్టప్రకారం న్యాయం చేయాలని సూచించారు.
గ్రీవెన్స్ డేలో స్వీకరించిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి, వాటి పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చే ఈ కార్యక్రమం ద్వారా సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.




