Sircilla: సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం పెంచాలి ఎస్పీ
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే రుద్రంగి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Sircilla: సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం పెంచాలి ఎస్పీ
సిరిసిల్ల: ప్రజల్లో సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై చైతన్యం పెంచాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, గ్రామీణ ప్రాంత ప్రజలు, యువతలో సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులను ఆదేశించారు.
మంగళవారం రుద్రంగి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసుల నిర్వహణ, స్టేషన్ పరిసరాలు, విధుల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచే విధంగా సేవలందించాలని ఎస్పీ సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గ్రామాల్లో రాత్రి పెట్రోలింగ్‌ను మరింత పటిష్ఠం చేయాలని, రౌడీషీటర్లు, గంజాయి, పేకాట, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలకు, యువతకు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. "నేను సైతం" కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో వాటి పాత్రను తెలియజేస్తూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను భాగస్వాములను చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ తనిఖీలో ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, ఎస్‌ఐ మోతిలాల్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




