Sircilla: మానవత్వం చాటుకున్న సిరిసిల్ల పోలీసులు.. వృద్ధాశ్రమంలో ఎస్పీ!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గంభీరావుపేటలోని "మా" అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని సందర్శించి, వృద్ధులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 20 Jun 2026 3:24 PM IST
Sircilla
X

Sircilla: మానవత్వం చాటుకున్న సిరిసిల్ల పోలీసులు.. వృద్ధాశ్రమంలో ఎస్పీ!

సిరిసిల్ల: మానవత్వం చాటుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలిచింది రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు శాఖ. గంభీరావుపేటలోని "మా" అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సందర్శించి వృద్ధులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి అవసరాలను తెలుసుకుని నిత్యావసర వస్తువులను అందజేశారు.

గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని "మా" అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని శనివారం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులతో కలిసి సమయం గడిపి వారి ఆరోగ్య పరిస్థితులు, సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వృద్ధులకు పండ్లు, బియ్యం, కిరాణా సరుకులు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి వారికి అండగా నిలిచారు. వృద్ధులు, నిరాశ్రయులు, అనాథల సంక్షేమం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.

వృద్ధుల సేవ చేయడం గొప్ప మానవతా ధర్మమని, అవసరమైన వారికి సహాయం అందించడంలో జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. పోలీసు శాఖ కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందంజలో ఉంటోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేష్, ఎస్ఐ శ్రీకాంత్‌తో పాటు వృద్ధాశ్రమ సభ్యులు పాల్గొన్నారు. వృద్ధులకు భరోసానిస్తూ, మానవతా విలువలను చాటిన జిల్లా పోలీసు శాఖ చర్యపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story