Illanthakunta: ఎల్లమ్మ జాతరలో జిల్లా ఎస్పీ పూజలు!
Illanthakunta: ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ ఎల్లమ్మ జాతర మహోత్సవాల్లో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Illanthakunta: ఎల్లమ్మ జాతరలో జిల్లా ఎస్పీ పూజలు!
ఇల్లంతకుంట: మండలం గాలిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ ఎల్లమ్మ జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జాతరలో పాల్గొన్న భక్తులతో జిల్లా ఎస్పీ ఆత్మీయంగా ముచ్చటించి వారి సంక్షేమాన్ని ఆకాంక్షించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జాతరను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని విధాలా చర్యలు చేపట్టిందని ఎస్పీ తెలిపారు. భక్తులు పోలీసుల సూచనలను పాటిస్తూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ అశోక్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




