Makthal: ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
Makthal: మండల్ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులపై రాష్ట్రస్థాయి పర్యవేక్షణ ఉందని, సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సిహెచ్ ప్రియాంక అధికారులకు ఆదేశాలు.
Makthal: ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
మక్తల్: మక్తల్ మండల కార్యాలయంలో ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను రాష్ట్రస్థాయిలోనూ పర్యవేక్షణ చేస్తున్నారని, సంబంధిత అధికారులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక అన్నారు. సోమవారం మండల్ ప్రజావాణి సందర్భంగా మక్తల్ ఎంపిడిఓ లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు.
ప్రజావాణి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించకపోవడంతో చాలామంది ప్రజలు అవే సమస్యలపై తిరిగి వస్తున్నారన్నారు. ఆయా ఆర్జీలను తిరస్కరించాల్సి ఉంటే అందుకు గల కారణాలను నిబంధనల ప్రకారం తెలియజేయాలని, ఆర్జీదారులకు ఏ విషయం చెప్పకుండా దరఖాస్తులను అలాగే వద్ద ఉంచుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




