Jammikunta: తనుగులలో ఆరోగ్య శిబిరం.. అడిషనల్ డీఎంహెచ్‌ఓ సమీక్ష!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామపంచాయతీ పరిధిలోని పరిమళ కాలనీవాసులకు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.
Jammikunta: తనుగులలో ఆరోగ్య శిబిరం.. అడిషనల్ డీఎంహెచ్‌ఓ సమీక్ష!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామపంచాయతీ పరిధిలో ని పరిమళ కాలనీవాసులకు ప్రత్యేక వైద్య శిబిరం (సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు) నిర్వహించడం జరిగింది.
ఈ క్యాంపులో లెప్రసీ విభాగం,ఐ సి టి సి విభాగం,ఎన్ టి ఈ పి విభాగం మరియు వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొని హెచ్ఐవి,హెపటైటిస్ బి, సిపిలిస్,టీ బి, బి పి, షుగరు వంటి పరీక్షలు చేసి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.
ఈ శిబిరాన్ని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రభుదాస్ సందర్శించడం జరిగింది, ఈ సందర్భంగా అడిషనల్ డి ఎం హెచ్ ఓ డాక్టర్ సుధా రాజేంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు విధిగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలని వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మలేరియా, డెంగ్యూ,చికెన్ గునియా మొదలగు వ్యాధులు వ్యాపించు విధానం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల పరిశుభ్రత,డ్రైడే ప్రత్యేకత గురించి వివరించడం జరిగింది.
లెప్రసీ తో బాధపడుతున్న వ్యక్తులు వాడుతున్న మందులు వారి జీవన స్థితిగతులను పరిశీలించడం జరిగింది,లెప్రసీతో బాధపడుతున్న వ్యక్తులకు పాదరక్షలు పంపిణీ చేయడం జరిగింది,బీపీ,షుగర్ మందులు ప్రైవేట్ మందులు వాడేవారు ప్రభుత్వ మందులనే వాడాలని తద్వారా ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వ మందులు సమర్థవంతంగా పనిచేస్తాయని వారికి వివరించారు.
అనుకోకుండా ఎవరైనా అనారోగ్యం బారిన పడితే అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్య సిబ్బందిని సంప్రదించాలని ప్రభుత్వ వైద్యాన్ని వినియోగించుకోవాలని వారికి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి డాక్టర్ కార్తీక్, డిపిఎంవోస్ కృపలాదేవి ప్రకాష్ రావు,సి హెచ్ ఓ సదానందం,హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్, ఏఎన్ఎంలు మనీ, రజిత,ఐ సి టి సి కౌన్సిలర్ మహిపాల్, ల్యాబ్ టెక్నీషియన్ ఇబ్రహీం,టీబీ స్క్రీనింగ్ శ్రీనివాస్ మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




