Sircilla: వర్షాల కోసం సిరిసిల్లలో ప్రత్యేక ఇస్తిస్కా నమాజ్ ముస్లింలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ఇస్తిస్కా నమాజ్ (వర్ష ప్రార్థన) నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 18 July 2026 1:24 AM IST
Sircilla
X

Sircilla: వర్షాల కోసం సిరిసిల్లలో ప్రత్యేక ఇస్తిస్కా నమాజ్ ముస్లింలు!

సిరిసిల్ల: వర్షాభావ పరిస్థితులతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ప్రత్యేక ఇస్తిస్కా నమాజ్ (వర్ష ప్రార్థన) నిర్వహించారు.

సిరిసిల్ల పట్టణ మజీద్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రార్థనలో మత గురువులు, మత పెద్దలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి వర్షాభావ పరిస్థితులు తొలగిపోవాలని, రైతులకు ఉపశమనం కలగాలని, పంటలు బాగా పండాలని, వ్యవసాయం సుభిక్షంగా సాగాలని అల్లాహ్‌ను వేడుకున్నారు.

అదేవిధంగా చెరువులు, కుంటలు, జలాశయాలు నిండాలని, భూగర్భ జలాలు పెరగాలని, ప్రజలు, పశుపక్ష్యాదులు, సమస్త జీవరాశులు సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ, అల్లాహ్ అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతన్నల కష్టం ఫలించి ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story