Kondagattu: అంజన్న సన్నిధిలో పవన్ కోసం ప్రార్థనలు
Kondagattu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా కోలుకోవాలని కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు.
Kondagattu: అంజన్న సన్నిధిలో పవన్ కోసం ప్రార్థనలు
Kondagattu: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఇటీవల నిర్వహించిన సైనసైటిస్ శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తూ జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చొప్పదండి నియోజకవర్గ జనసేన నాయకుడు మొగిలిపాలెం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ వారి కష్టాలను తీర్చడంలో ఎప్పుడూ ముందుండే నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇచ్చే నిబద్ధత కలిగిన నాయకుడు ఆయన అని పేర్కొన్నారు. త్వరలోనే ఆయన మరింత ఉత్సాహంతో, నూతనోత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని కొండగట్టు అంజన్నను ప్రార్థించినట్లు తెలిపారు.
తదనంతరం తెలంగాణ రాష్ట్ర యువత ఆడ్ హాక్ కమిటీ సభ్యుడు సాయికృష్ణ మాట్లాడుతూ, శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో కూడా టెలి కాన్ఫరెన్స్‌ల ద్వారా పాలనలో భాగస్వామ్యం అవుతున్న పవన్ కళ్యాణ్ నిబద్ధతకు ఇది నిదర్శనం అని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రజానాయకుడు ఆయన అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం అనంతరం మొగిలిపాలెం రమేష్ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి (E.O.)ను కలిసి శాలువాతో సత్కరించారు. భక్తుల మాల విరమణ మండపం నిర్మాణానికి సంబంధించిన వివరాలు అడగగా, ఆలయ ఈ.ఓ. స్పందిస్తూ ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఎంపిక చేసిన స్థలంలో భూసారం పరీక్షలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు రానున్నారని, వారి నివేదికల ఆధారంగా టెండర్లు పిలిచి వచ్చే హనుమాన్ జయంతి నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా, ప్రతి నెలలో ఒక రోజును “కొండగట్టు ఆలయ శుభ్రత దినం”గా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాలనే ప్రతిపాదనను నాయకులు ఈ.ఓ.కు వినిపించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఆలయంలో నిర్వహించే సేవా కార్యక్రమాలకు జనసేన పార్టీ వీర మహిళలు, జన సైనికులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని నాయకులు తెలిపారు. దీనిపై ఈ.ఓ. కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చొప్పదండి నియోజకవర్గ సీనియర్ నాయకులు తడగొండ నర్సింగ్ బాబు, దూడం శ్రీనాథ్, మానేరు జగదీష్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్, జక్కని అఖిల్, కూచని శ్రీకాంత్, జుంగవేనీ రాజు, కనకట్ల శ్రీనివాస్, కైరా లక్ష్మణ్, వీరబత్తిని సాగర్, కాయిత రమేష్, శ్యామ్, ఒడ్నాల సాయి, అయిలాపురం సాయికృష్ణ, మద్దివేణి సాయికుమార్, మారంపెల్లి రాజు, గుడ్ల వాసు తదితరులు పాల్గొన్నారు.




