Dharmapuri: ధర్మపురిలో యమద్వితీయ వేడుకలు.. యమధర్మరాజుకి ప్రత్యేక పూజలు!
Dharmapuri: జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన యమధర్మరాజు సన్నిధిలో యమద్వితీయ సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు.
Dharmapuri: ధర్మపురిలో యమద్వితీయ వేడుకలు.. యమధర్మరాజుకి ప్రత్యేక పూజలు!
Dharmapuri: ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదని తరతరాల నుంచి స్థిరపడ్డ ఓ నానుడి ఉంది. అంతా ప్రత్యేకత ,విశిష్ఠత, పవిత్రతలు సంతరించుకున్న జగిత్యాల జిల్లా ధర్మపురి నృసింహుడి ఆలయంలో దేశంలోనే ఎక్కడ లేని విధంగా యమధర్మరాజు విగ్రహ రూపంలో వేలవడం మరింత విశేషం. యమ ద్వితీయ సందర్భంగా ధర్మపురిలో యమధర్మరాజుకి ప్రత్యేక పూజలు.
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయంలో మాత్రమే యమధర్మరాజు ఆలయం కనిపిస్తుంది. అంతటి విశిష్టత,ప్రాధాన్యత సంతరించుకున్న ధర్మపురి యమధర్మరాజు సన్నిధిలో యమద్వితీయ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యమధర్మరాజు యమునలు సూర్య భగవానుడికి సంధ్య దేవికి పుట్టిన బిడ్డలు కాగా.. యమధర్మరాజు యమపురిని ఏలే పనిలో నిమగ్నమవ్వగా నది రూపంలో ప్రవహించి యమునా తరచు సోదరుడైన యమున ఓసారి ఇంటికి రమ్మని పట్టుబడుతుంది.
పాపాత్ముల శిక్షల ఖరారిలో ఎల్లప్పుడు తీరిక లేకుండా గడిపే యముడు దీపావళి తర్వాత వచ్చే బహు విదియ యమద్వితీయ రోజు చెల్లెలింటికి వస్తానని చెప్పడం అదేవిధంగా వెళ్లటంతో బహువిదియ యమద్వితీయగా పిలువబడుతోంది.
అందుకే ఈరోజు పాపాత్ములు కూడా సంతోషంగా ఉంటారని ఈరోజు నరకానికి సెలవని చారిత్రిక కథలను బట్టి చెప్పుకుంటుంటారు.
అందుకే ప్రతి ఏడాది యమవిదియ వచ్చిందంటే తోడబుట్టిన వారు ఆడపడుచుల ఇంటికి వెళ్లి మంగళ హారతులు తీసుకోవడం సాంప్రదాయంగా, ఆనవాయితీగా కొనసాగుతోంది. అలాంటి యమ విదియ సందర్భంగా పరమ పవిత్రమైన శ్రీ లక్ష్మి నృసింహుడి ఆలయంలోని అనుబంధ సన్నిదైన యముడి గుళ్లో విశేష పూజలను నిర్వహించారు.




