Indiramma Illu Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్ ఫోకస్.. పనులు వేగవంతం చేయాలని కఠిన ఆదేశాలు!
Indiramma Illu Scheme: కరీంనగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
Karimnagar: ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్ ఫోకస్.. పనులు వేగవంతం చేయాలని కఠిన ఆదేశాలు!
కరీంనగర్ : లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో 25వ డివిజన్ పరిధి సుభాష్ నగర్ ఏరియా బుట్టి రాజారాం కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్.. డిఆర్ఓ స్వామి, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఇల్లు మంజూరై పనులు ప్రారంభించని లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చూడాలన్నారు. జిల్లాలో బిల్లులు జమ కాని లబ్ధిదారుల వివరాలతో నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇళ్ల నిర్మాణం పరిశీలించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ స్వామి, గృహ నిర్మాణ శాఖ అధికారులు డీఈ వెంకటరమణ, ఏఈలు ఊర్మిళ, వర్షిని తదితరులు పాల్గొన్నారు.




