Karimnagar: విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను ఢీకొట్టి వెళ్లిన కార్!

Karimnagar: కరీంనగర్ ఆదర్శనగర్ వద్ద బ్లూకోట్స్ కానిస్టేబుళ్లను ఢీకొట్టిన కారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 25 Sept 2026 10:26 AM IST
Karimnagar
X

Karimnagar: విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను ఢీకొట్టి వెళ్లిన కార్!

Karimnagar: కరీంనగర్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో నగరంలోని ఆదర్శనగర్ బోర్డు వద్ద విధులు నిర్వహిస్తున్న త్రీ టౌన్ బ్లూకోట్ కానిస్టేబుల్ లను ఢీ కొట్టిన కారు. ఈ ప్రమాదంలో బ్లూ కోర్ట్ కానిస్టేబుళ్లు శివ రత్నంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే కానిస్టేబుల్ లను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తీవ్ర గాయాలైన రత్నం ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలైన శివను ప్రాథమిక చికిత్స అందించి ఇంటికి పంపించి వేశారు. తీవ్ర గాయాలైన రత్నంకు కాలు ఫ్యాక్చర్ తలకు బలమైన గాయాలు కావడంతో మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు. కాగా ప్రమాదానికి కారణమైన కారుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. కాగా ప్రమాదానికి కారణమైన హుండాయ్ క్రెటా కార్ సుభాష్ నగర్ కు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిందని పోలీసులు గుర్తించారు. సంబంధిత ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN