Karimnagar: శ్రీ చైతన్య చైర్‌పర్సన్ జన్మదినం: ఘనంగా అన్నదానం

Karimnagar: శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్‌పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినం సందర్భంగా కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం నిర్వహించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 6 Nov 2026 8:18 PM IST
Karimnagar
X

Karimnagar: శ్రీ చైతన్య చైర్‌పర్సన్ జన్మదినం: ఘనంగా అన్నదానం

కరీంనగర్: శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్ పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదిన వేడుకలను కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బాటసాదులకు ఆకలితో ఉన్నవారికి అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కరీంనగర్ శ్రీ చైతన్య విద్యాసంస్థల కోఆర్డినేటర్ రాజు సార్ మాట్లాడుతూ శ్రీ చైతన్య చైర్పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదిన సందర్భంగా నగరంలో పేదవారికి ఆకలితో ఉన్నవారికి అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి కి కరీంనగర్ శ్రీ చైతన్య విద్యాసంస్థల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అంకుటిత దీక్ష నిరంతర కృషి అంకితాభావం దూర దృష్టితో విద్యారంగంలో శ్రీ చైతన్యను అగ్రగామిగా నిలిపిన ఝాన్సీ లక్ష్మీబాయి ఎందరికో ఆదర్శమూర్తిని అన్నారు. విద్యారంగములో దర్శనీకత వహిస్తూ ఎన్నో విజయాలను సాధిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.

శ్రీ చైతన్య సంస్థను అగ్రగామిగా నిలిపిన లక్ష్మీబాయి గారు మరెన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మరెన్నో విజయాలను మా శ్రీ చైతన్యకు అందించాలని కోరుకుంటూ విద్యాసంస్థల తరఫున మరొకమారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN