Sircilla: సిరిసిల్లలో చిన్నారుల 'కప్పతల్లి ఆట': వర్షాల కోసం వరుణ జపం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రదర్శన. వర్షాలు సమృద్ధిగా కురవాలని కప్పతల్లి ఆటతో వరుణదేవుడికి పూజలు.

KALEEM, SIRICILLA
Published on: 19 July 2026 10:36 AM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో చిన్నారుల 'కప్పతల్లి ఆట': వర్షాల కోసం వరుణ జపం!

Sircilla: వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణదేవుడికి ప్రత్యేక ప్రార్థనలు చేసిన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రైతన్నల కోసం చిన్నారులు నిర్వహించిన వరుణ జపం అందరినీ ఆకట్టుకుంది. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు గ్రామీణ సంప్రదాయమైన *'కప్పతల్లి ఆట'*ను ప్రదర్శిస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణదేవుడిని వేడుకున్నారు.

ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, రైతుల కష్టాలను పాటలు, నృత్యాల రూపంలో చిన్నారులు హృద్యంగా ఆవిష్కరించారు. ప్రత్యేక వేషధారణలో చేసిన ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

కార్యక్రమం అనంతరం విద్యార్థులు వరుణదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. చెరువులు, కుంటలు నిండాలని.. పంటలు సమృద్ధిగా పండాలని.. రైతు కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరియాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రైతాంగానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. చిన్నారుల ఈ వినూత్న కార్యక్రమంపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story