Karimnagar: అల్గునూర్ చౌరస్తాలో ఉద్రిక్తత.. శ్రీనిధ్ మృతిపై కుటుంబీకుల రాస్తారోకో!

Karimnagar: కరీంనగర్ 7వ డివిజన్ సదాశివపల్లెకు చెందిన జార్తి శ్రీనిధ్ అనుమానాస్పద మృతిపై కుటుంబీకులు, గ్రామస్తులు అల్గునూర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 25 May 2026 11:38 AM IST
Karimnagar
X

Karimnagar: అల్గునూర్ చౌరస్తాలో ఉద్రిక్తత.. శ్రీనిధ్ మృతిపై కుటుంబీకుల రాస్తారోకో!

కరీంనగర్: ఏడవ డివిజన్ సదాశివపల్లెకు చెందిన యువకుడు జార్తి శ్రీనిధ్ మృతిపై వివరాలు తెలుపాలని, న్యాయం చేయాలని, దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఈరోజు అల్గునూర్ చౌరస్తాలో సుమారు అరగంట పాటు రాస్తారోకో చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ గ్రామ శివారులోని ఎల్ఎండీ రిజర్వాయర్ స్థలంలో యువకుడు జార్తి శ్రీనిధ్ అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరివేసి మృతి చెంది ఉండగా తల్లి కనకలక్ష్మీ ఫిర్యాదు మేరకు ఆదివారం ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు. కాగా శ్రీనిధ్ మృతిపై అనుమానాలున్నాయని, వెంటనే ధర్యాప్తు చేపట్టి వివరాలు తెలుపాలని, బాధిత కుటుంభానికి న్యాయం చేయాలని కోరుతూ అల్గునూర్ చౌరస్తాలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, యువకులు రాస్తారోకో చేశారు.

శ్రీనిధ్ ని ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, వెంటనే వారిని పోలీసులు గుర్తించాలని కోరారు. లేనిపక్షంలో ఆంధోళనను ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. మానకొండూర్ సీఐతోపాటు ఎల్ఎండీ పోలీసులు రాస్తారోకో వద్దకు చేరుకుని ధర్యాప్తును వేగవంతం చేస్తామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా బాధిత కుటుంభానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు. తప్పు చేసిన వారిని తప్పకుండా శిక్షిస్తామని ఏసీపీ విజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు బాధితుని ఇంటి వద్దకు వెళ్లి హామిచ్చారు. అల్గునూర్ చౌరస్తాలో అరగంటపాటు రాస్తారోకో చేయడంతో అటు వరంగల్, ఇటు హైదరాబాద్ తోపాటు కరీంనగర్ వైపు సైతం వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పాడింది. పోలీసులు ట్రాఫిక్ ని క్రమబద్దీకరించారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story