Srirampur: శ్రీరాంపూర్ రైతు వేదికలో ఘనంగా ‘విత్తనాల మేళా’!
Srirampur: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్వహణలో భాగంగా శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ‘విత్తనాల మేళా’ ఘనంగా జరిగింది.
Srirampur: శ్రీరాంపూర్ రైతు వేదికలో ఘనంగా ‘విత్తనాల మేళా’!
Srirampur: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్వహణలో భాగంగా శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు ‘విత్తనాల మేళా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాబోయే పంట కాలానికి రైతులకు నాణ్యమైన విత్తనాల లభ్యత, సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ మేళాలో శ్రీరాంపూర్ మండల వ్యవసాయ అధికారి (AO) సంధ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ధృవీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, నకిలీ విత్తనాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. రైతు వేదికలు రైతులకు దిక్సూచిలా మారుతున్నాయని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOs) సతీష్, ఈశ్వర్, శ్రీనివాస్ రెడ్డి, సంకీర్తన, స్పందనలతో పాటు స్థానిక విత్తన డీలర్లు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. విత్తన డీలర్లు రైతులకు అందుబాటులో ఉంచిన వివిధ రకాల విత్తనాల రకాలను, వాటి ప్రాధాన్యతలను ఈ సందర్భంగా రైతులకు వివరించారు.




