Karimnagar: SRR కళాశాలలో జర్నలిజం విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం!

Karimnagar: కరీంనగర్ SRR డిగ్రీ కళాశాలలో 28వ బ్యాచ్ జర్నలిజం సర్టిఫికెట్ కోర్స్ వీడ్కోలు సభ జరిగింది. విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 25 Aug 2026 8:02 PM IST
Karimnagar
X

Karimnagar: SRR కళాశాలలో జర్నలిజం విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం!

కరీంనగర్: శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల (స్వ) కరీంనగర్ లో నేడు 28 వ బ్యాచ్ జర్నలిజం సర్టిఫికెట్ కోర్స్ వీడ్కోలు కార్యక్రమం, సర్టిఫికెట్స్ ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమాన్ని కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ శ్రీ టి. రాజయ్య గారు ప్రారంభించారు.

వారు మాట్లాడుతూ జర్నలిజం అనేది నిస్వార్థ వృత్తి అని, దానిని ఎంతో నిబద్ధతతో నిర్వహించాలని, జర్నలిస్టుకు భాషా పరిజ్ఞానం చాలా అవసరం అన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీనియర్ జర్నలిస్ట్ కొయ్యడ చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ జర్నలిజం అనేది లాభాపేక్ష లేని వృత్తి అని, మానవత్వంతో ప్రవర్తిస్తూ నిరంతరం తనను తాను అభివృద్ధి చేసుకుంటూ వెళ్లేవాడు ఈ రంగంలో నిలదొక్కుకుంటాడని చెప్పారు.

కళాశాల ఐక్యూఏసి ఇంచార్జ్ డా. హర్జ్యోత్ కౌర్ గారు మాట్లాడుతూ ఆదర్శనీయమైన జర్నలిస్ట్ వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. తెలుగు విభాగం అధ్యక్షులు, కోర్స్ కో ఆర్డినేటర్ డా. బూర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ జర్నలిజం సర్టిఫికెట్ కోర్స్ ద్వారా విద్యార్థులకు భాష, రచనా నైపుణ్యాలను పెంపొందిస్తున్నామన్నారు.

భాషా నిపుణత జర్నలిస్టుకు అత్యంత ప్రాధాన్యం అన్నారు. అనంతరం ముఖ్య అతిథులు, వైస్ ప్రిన్సిపాల్స్ వారి చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు.ఈ కార్యక్రమంలో తెలుగు విభాగ అధ్యాపకులు బూర్ల వేంకటేశ్వర్లు, డా. డి. ప్రకాష్, డా.పాత అశోక్. డా. పి. చైతన్య, డా. టి. భోజన్న, పి.శంకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story