Thangallapalli: గిగ్ వర్కర్లు రోజువారీ కార్మికుల వేతన వివరాలపై ఫోకస్!

Thangallapalli: తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెలో జిల్లా గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పీఎల్ఎఫ్‌ఎస్ లేబర్ సర్వే ప్రారంభమైంది.

KALEEM, SIRICILLA
Published on: 22 July 2026 4:25 PM IST
Thangallapalli
X

Thangallapalli: గిగ్ వర్కర్లు రోజువారీ కార్మికుల వేతన వివరాలపై ఫోకస్!

తంగళ్లపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెలో జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS)-2026 నిర్వహించారు.ఉమ్మడి జిల్లా గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... దేశంలో ఉపాధి, నిరుద్యోగం, స్వయం ఉపాధి, కార్మిక శక్తి భాగస్వామ్యంపై ఖచ్చితమైన గణాంకాల సేకరణే ఈ సర్వే ప్రధాన ఉద్దేశమన్నారు.

ఎంపికైన కుటుంబాలను మూడు నెలల పాటు ప్రతి నెల సందర్శించి ఉద్యోగం, వేతనాలు, స్వయం ఉపాధి, గిగ్ వర్కర్ల వివరాలు తదితర సమాచారాన్ని సేకరిస్తామని తెలిపారు. సర్వేలో అందించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని, గణాంకాల రూపకల్పనకు మాత్రమే వినియోగిస్తామని స్పష్టం చేశారు.ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా సరైన సమాచారాన్ని అందించి సర్వే విజయవంతం కావడానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story