Dharmapuri: ధర్మపురిలో కుక్కల స్వైరవిహారం.. 15 మందికి గాయాలు!

Dharmapuri: ధర్మపురిలో పిచ్చి కుక్కల దాడి. 15 మందికి తీవ్ర గాయాలు. నిత్యం పెరుగుతున్న వీధి కుక్కల బెడదపై అధికారుల నిర్లక్ష్యం.

RAMESH, DHARMPURI
Published on: 25 April 2026 12:14 PM IST
Dharmapuri
X

Dharmapuri: ధర్మపురిలో కుక్కల స్వైరవిహారం.. 15 మందికి గాయాలు!

Dharmapuri: ధర్మపురి పట్టణంలోని పాత హరిజన కాలనీలో శుక్రవారం సాయంత్రం పిచ్చికుక్క దాడి ఘటనలో 15 మంది గాయపడ్డారు. పిచ్చి కుక్క దాడికి గురైన వారిలో చిన్న పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. ఈ దాడిలో స్వల్పంగా గాయపడిన వారు ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందగా, తీవ్ర గాయాలైన వారిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ధర్మపురిలో వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. గతంలో కూడా ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. తీవ్రంగా గాయపడిన బాలుడు కొన్నాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ తరుచుగా జరుగుతున్న ప్రజాప్రతినిధులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు.

చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్..

ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. వీధి కుక్కల వ్యవహారం ప్రజల ప్రాణాల మీదికి వచ్చిన అధికారుల తీరులో ఎలాంటి చలనం లేకపోవటం దురదృష్టకరంగా భావించాలి. ఇప్పటికైన మున్సిపాలిటీ అధికారులు ధర్మపురిలో వీధి కుక్కల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రజలు రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అయిన అధికారులు పెడచెవిన పెడుతున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లక ముందే వీధి కుక్కల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI

Next Story