Peddapalli: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ఆల్‌రౌండర్లుగా ఎదగాలి!

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ శ్రీ వేదవాస పాఠశాలలో జరిగిన చిల్డ్రన్స్ డే వేడుకల్లో తాసిల్దార్ రాముడు ముఖ్య అతిథిగా పాల్గొని, క్రీడల్లో విజేతలను సన్మానించారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 17 Nov 2026 8:27 AM IST
Peddapalli
X

Peddapalli: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ఆల్‌రౌండర్లుగా ఎదగాలి!

Peddapalli: విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, సాంస్కృతిక అంశాల్లోనూ ప్రతిభ కనబరుస్తూ ఆల్‌రౌండర్లుగా ఎదగాలని కాల్వ శ్రీరాంపూర్ తాసిల్దార్ రాముడు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని శ్రీ వేదవాస పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ జూపాక ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాసిల్దార్ రాముడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

​ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు హాజరైన వారిని ఎంతగానో అలరించాయి. అనంతరం ఇటీవల జాతీయ స్థాయి కరాటే, వివిధ క్రీడా పోటీలలో ప్రతిభ చాటిన పాఠశాల విద్యార్థులను తాసిల్దార్ రాముడు శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు (మెమెంటోలు) అందజేసి అభినందించారు.

​ఈ సందర్భంగా తాసిల్దార్ రాముడు మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థులకు అకడమిక్ సబ్జెక్టులతో పాటు వారిలో ఆలోచనా శక్తిని (థింకింగ్ పవర్), విశ్లేషణాత్మక ఆలోచనలను పెంపొందించేలా బోధన అందించాలని ఉపాధ్యాయులకు, యజమాన్యానికి సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి, ఉన్నత లక్ష్యాలను సాధించడం ద్వారా తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు మరియు దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్.ఐ) వినోద్ రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్లు జూపాక ఉమామహేశ్వరరావు, దివాకర్, ప్రిన్సిపల్ సదయ్య, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli