Karimnagar: ఎడ్ల బండి పై కార్యాలయానికి వచ్చిన సుడా చైర్మన్!
Karimnagar: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కరీంనగర్‌లో ఎడ్లబండిపై ప్రయాణించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి.
Karimnagar: ఎడ్ల బండి పై కార్యాలయానికి వచ్చిన సుడా చైర్మన్!
కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు పెంచుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తన ఇంటి నుండి కార్యాలయానికి ఎడ్ల బండి పై ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడుతుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై స్లోపాయిజన్ ఇచ్చినట్టు రోజుకింతా పెంచుతున్నారని ఇలా చేయడం సిగ్గుచేటు అన్నారు. మోడీ సర్కార్ మాటలతో మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని లేకపోతే ప్రజలతో కలిసి పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
Next Story




