Karimnagar: పెట్రోల్ ధరల పెంపును వెనక్కి తీసుకోండి.. సుడా చైర్మన్ డిమాండ్

Karimnagar: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల వల్లే ‘నీట్’ పరీక్షా పత్రం లీక్ అయిందని, ఇటు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోందని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 19 May 2026 8:51 PM IST
Karimnagar
X

Karimnagar: పెట్రోల్ ధరల పెంపును వెనక్కి తీసుకోండి.. సుడా చైర్మన్ డిమాండ్

కరీంనగర్: నాలుగు రోజుల్లో పెట్రోల్,డీజిల్ పై లీటరుకు నాలుగు రూపాయల చొప్పున భారం వేసి సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రం ప్రభుత్వం ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ మరియు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడుతూ మోడీ సర్కార్ మొదటినుంచి మాటల గారడి చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని,

కార్పోరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దారదత్తం చేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్కసారి పెంచుతే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుందని విడుతల వారీగా పెంచుతూ ప్రజలపై తీవ్ర భారం మోపాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ప్రజలు గమనించాలని సమయం వచ్చినప్పుడు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. ఇప్పటికైనా ధరల పెరుగుదలను ఆపాలని పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఖాళీ ఖజానా అప్పజెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ధరలు పెంచలేదని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.నీట్ పరీక్షా పత్రం లీక్ కు సంబంధించి దేశ వ్యాప్తంగా 26 లక్షల మంది రాష్ట్రంలో 70 వేల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని నరేందర్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోడీ కి మైకు దొరికితే చాలు మాటల గారడి చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తారని పాలన మాత్రం చేత కాదని విమర్శించారు.

నీట్ పరీక్షా పత్రం లీక్ పై బీజేపీ నాయకులు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన లాగే బీజేపీ ప్రభుత్వం కూడా నడుస్తుందని బీఆర్ ఎస్ ప్రభుత్వంలో అన్నీ లీక్ లే అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పగడ్బందీగా పోటీ పరీక్షలు నిర్వహించి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని నరేందర్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో తాజొద్దీన్, పిట్టల రవీందర్, కార్పోరేటర్లు మల్లికార్జున రాజేందర్, గంట శ్రీనివాస్, జగన్ రెడ్డి, పర్వతం మల్లేశం, వరాల నర్సింగం, నాయకులు చాడగొండ బుచ్చిరెడ్డి, టెల భూమయ్య, సరిల్ల ప్రసాద్, బాలరాజు, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, జీడి రమేష్, మ్యాకల నర్సయ్య,బత్తిని చంద్రయ్య, సుదర్శన్, మాసుం ఖాన్, శ్రీధర్ రెడ్డి,షెహెన్ష, భారీ, బషీర్, ఖలీల్, జమీల్, హనీఫ్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story