Karimnagar: హరీష్ రావుపై కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్!
Karimnagar: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
Karimnagar: హరీష్ రావుపై కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్!
కరీంనగర్: స్కాంల పై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడడం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు.ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రులను విమర్శించే హక్కు లేదని బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అన్నీ స్కాంలే అని పచ్చ కామెర్ల రోగికి లోకమంత పచ్చగ కనిపించినట్టు గతంలో స్కాంల అలవాటున్న హరీష్ రావుకు అందరు అలాగే కనిపిస్తున్నారని నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
పది సంవత్సరాలలో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్థులకు మెస్ చార్జీలు,కాస్మొటిక్ చార్జీలు పెంచాలన్న సోయి లేదు కానీ కష్టపడి పైకొచ్చిన మంత్రులు పొన్నం ప్రభాకర్,అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజహరుద్దీన్ శాఖలలో టెండర్లలో స్కాం జరిగిందని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని నరేందర్ రెడ్డి విమర్శించారు.
పేద విద్యార్థుల బాధలు తెలిసిన వాళ్లు కాబట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెస్ మరియు కాస్మెటిక్ చార్జీలు 40 శాతం పెంచిందని అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని నరేందర్ రెడ్డి మండిపడ్డారు.నిజాయితీకి నిలువుటద్దంగా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు పై మాజీ ఎమ్మెల్యే పుట్టమధు అనుచిత వ్యాఖ్యలు చేశారని పుట్ట మధు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.
ఈ విలేఖరుల సమావేశంలో కరీంనగర్ కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్,ఆకారపు భాస్కర్ రెడ్డి,మడుపు మోహన్,అంజనీ ప్రసాద్,వరాల నర్సింగం,కాంరెడ్డి రాంరెడ్డి,దండి రవీందర్,నెల్లి నరేష్, షెహన్షా,ఎల్లారెడ్డి,హనీఫ్,ఖలీల్,బషీర్ తదితరులు పాల్గొన్నారు.




