Karimnagar: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సుడా చైర్మన్
Karimnagar: కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్, బహదూర్ఖాన్ పేట్ గ్రామాల్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి రూ. 15 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Karimnagar: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సుడా చైర్మన్
కరీంనగర్ : కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్,బహదూర్ఖాన్ పేట్ లో సుడా నిధులతో పలు అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ముగ్దుంపూర్ మెయిన్ రోడ్డు ఆనుకొని 5 లక్షలతో డ్రెయిన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం బహదూర్ఖాన్ పేట్ లో 10 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రజల కోరిక మేరకు అవసరమైన చోట అభివృద్ధికి నిరంతరంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రాబోయే రోజుల్లో ఇంకా అనేక అభివృద్ధి పనులు చేపడుతామని అన్నారు.
ఈ కార్యక్రమాలలో శ్రీగిరి రంగారావు,బహద్దూర్ఖాన్ పేట్ సర్పంచ్ గుర్రం తిరుపతి రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, వార్డ్ మెంబర్ తప్పట్ల అంజయ్య, మరియు దుబ్బపల్లి సర్పంచ్ మోతే ప్రశాంత్ రెడ్డి, చామనపల్లి సర్పంచ్ బోగొండ అయిలయ్య, చర్లబుత్కూర్ సర్పంచ్ కూర నరేష్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రం అంజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేందర్, మొగ్దుంపూర్ గ్రామ వార్డ్ మెంబర్ మల్లారెడ్డి, సిరిగిరి రంగారావు, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.




