బీఆర్ఎస్, బీజేపీలది ‘ముందస్తు ఒప్పంద’ డ్రామా: సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆగ్రహం

కరీంనగర్ బంద్ పిలుపుపై సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే బంద్ విరమించుకోవాలని కోరారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 8 May 2026 8:59 PM IST
బీఆర్ఎస్, బీజేపీలది ‘ముందస్తు ఒప్పంద’ డ్రామా: సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆగ్రహం
X

కరీంనగర్: రెండు పార్టీలు కావాలని దాడి చేసుకుని బందు పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతారా నరేందర్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ మీ డ్రామాలతో ప్రజలు ఇబ్బంది పడాలా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్,బీజేపీ రెండు పార్టీల వైఖరి నువ్వు కొట్టినట్టు చేయ్ నేను అరచినట్టు చేస్తా అన్న చందంగా ఉందని రెండు పార్టీల నాయకులు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకొని దాడులు చేసుకుని అందులో ఒక పార్టీ బందుకు పిలుపు ఇవ్వడం సిగ్గుచేటని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు.

పరస్పరం రెండు పార్టీలు అవసరాన్ని బట్టి సహకరించుకుంటూ మళ్లీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.ఈ డ్రామాను రంజింపచేయడానికి బిఆర్ఎస్ పార్టీ బందు పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తుందని నరేందర్ రెడ్డి ఆరోపించారు.ఇప్పటికైనా పునరాలోచించి బందు కార్యక్రమాన్ని విరమించుకోవాలని నరేందర్ రెడ్డి సూచించారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story