Karimnagar: గన్ తీసి కాల్చినా తగ్గని ఉద్యోగులు.. పీఎంజే జ్యువెల్లరీలో అసలేం జరిగింది?
Karimnagar: కరీంనగర్ జ్యువెల్లరీ షాపు కాల్పుల ఘటనపై సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్పందన.
Karimnagar: గన్ తీసి కాల్చినా తగ్గని ఉద్యోగులు.. పీఎంజే జ్యువెల్లరీలో అసలేం జరిగింది?
కరీంనగర్: జ్యువెల్లరీ షాపు సంఘటనలో గాయపడ్డ బాధితులను పరామర్శించి మీడియాతో మాట్లాడిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. పిఎంజే జ్యువెల్లరి షాపులో జరిగిన సంఘటన దురదృష్టకరం అని దుండగులను కఠినంగా శిక్షించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పోలీసులను కోరారు.దుండగులు అదను చూసి చోరీకి పాల్పడ్డారని షాపు ఉద్యోగులు ప్రతిఘటించగానే దుండగులు కాల్పులకు పాల్పడ్డారని త్వరలోనే దుండగులను పట్టుకోవడం జరుగుతుందని నరేందర్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్,పాడి కౌశిక్ రెడ్డి లు దీన్ని రాజకీయం చేయాలని చూడడం సరికాదని కేసీఆర్ పాలనలో చీమకు కూడా హాని జరుగలేదని ఈ సమయంలో డబ్బా కొట్టుకోవడం బాధాకరం అని లెక్కలు పెట్టుకునే సమయం ఇది కాదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
జరిగిన సంఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఎప్పడికప్పుడు పర్యవేక్షిస్తుందని దుండగులను పోలీసులు పట్టుకొని కఠినంగా శిక్షించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కమాండ్ కంట్రోల్ సెంటర్ పనిచేస్తలేదని,సీసీ కెమెరాలు పనిచేస్తలేవని తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నీ పని చేస్తున్నాయని వాటిని ఇంకా మెరుగు పరచడానికి పోలీసులతో సమన్వయం చేసి నిధులు కేటాయిస్తామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిఘటనను రాజకీయం చేయాలని చూడడం సమంజసం కాదన్నారు.




