Sultanabad: నిర్ణీత గడువులోగా భూ పునఃసర్వే పూర్తి చేయాలి
Sultanabad: సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ పునఃసర్వే, భూ భారతి దరఖాస్తులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Sultanabad: నిర్ణీత గడువులోగా భూ పునఃసర్వే పూర్తి చేయాలి
సుల్తానాబాద్: సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను, భూ భారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, భూ పునఃసర్వే మొదటి విడతలో భాగంగా ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే పనులను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సర్వే పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
భూ భారతి కింద అందిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా, ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులోగా పరిశీలించి పరిష్కరించాలని స్పష్టం చేశారు. దరఖాస్తుల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, గడువు దాటిన దరఖాస్తులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలు తమ భూ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడంతో పాటు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రికార్డులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.
ఈ పర్యటనలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ,సుల్తానాబాద్ తహసీల్దార్ బషిరుద్ధిన్, తదితరులు ,పాల్గొన్నారు.




