Sultanabad: సుల్తానాబాద్‌లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
Sultanabad: సుల్తానాబాద్‌లో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు నివాళులు. చేనేత అభివృద్ధికి రూ. 15 లక్షలు కేటాయింపు.
Sultanabad: సుల్తానాబాద్‌లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
సుల్తానాబాద్: సుల్తానాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర చేనేత సొసైటీ వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా భక్త మార్కండేయ, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన గౌరవ ప్రభుత్వవిప్ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు.
అనంతరం చేనేత కార్మికులను ప్రభుత్వవిప్ ఎమ్మెల్యే విజయరమణ రావు గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వవిప్ ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ...
చేనేత సొసైటీ కంపౌండ్ వాల్ కు రూ.10 లక్షలు, పద్మశాలి సంఘం కమ్యూనిటీ హాల్ పూర్తి స్థాయి నిర్మాణా పనులకు రూ.5 లక్షలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. స్థానిక చేనేత సొసైటీ బకాయిల మాఫీ కోసం చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
చేనేత కార్మికుల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, వాటి పరిష్కారానికి పూర్తిస్థాయిలో తనను వినియోగించుకోవాలని కోరారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్,అన్నయ్య గౌడ్,మున్సిపల్ చైర్మన్,బిరుదు కృష్ణ వైస్ చైర్ పర్సన్, పుష్పల్తా,కమీషనర్, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు వేముల రామ్మూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐల రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు సాయిరి మహేందర్, ఓదెల దేవస్ధానం చైర్మన్ చీకట్ల మొండయ్య, డైరెక్టర్ సామల యమున హరికృష్ణ,
చేనేత సొసైటీ అధ్యక్షురాలు గోలి పద్మ శ్రీనివాస్, కౌన్సిలర్ గాదాసు మంజుల రవి, జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు మేరుగు యాదగిరి, మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుండ మురళి, పోపా జిల్లా కార్యదర్శి సామల రాజేంద్ర ప్రసాద్, తుమ్మ రాములు మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.




