Sultanabad: సుల్తానాబాద్ సభను విజయవంతం చేయాలి సారయ్య గౌడ్
Sultanabad: సుల్తానాబాద్‌లో జరిగే మంత్రుల బహిరంగ సభకు కాల్వ శ్రీరాంపూర్ నుండి పెద్ద ఎత్తున తరలివెళ్లాలని కోరిన మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్.
Sultanabad: సుల్తానాబాద్ సభను విజయవంతం చేయాలి సారయ్య గౌడ్
సుల్తానాబాద్: రేపు సుల్తానాబాద్ లో జరిగే మంత్రుల పర్యటన బహిరంగ సభకు కాల్వ శ్రీరాంపుర్ మండలం నుంచి పెద్ద మొత్తంలో తరలి తరలి వెళ్లి బహిరంగ సభను విజయవంతం చేయాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ పిలుపునిచ్చారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుల్తానాబాద్ లో రేపు జరగబోయే మంత్రుల పర్యటనకు కాల్వ శ్రీరాంపూర్ మండలం నుంచి ప్రజా ప్రతినిధులు సర్పంచులు కాంగ్రెస్ నాయకులు మహిళలు ప్రజలు పెద్ద మొత్తంలో తరలివెళ్లి బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు కోరారు.
మంత్రుల పర్యటనలో కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తున్నారని గర్రెపల్లి నుంచి పెగడపల్లి వరకు 100 కోట్ల నిధులతో రెండు వరసుల బిటి రోడ్డు, వెన్నంపల్లి క్రాస్ నుంచి ముత్తారం వరకు డబల్ రోడ్డు నిర్మాణం, గంగారం నుంచి పందిళ్ల వరకు డబల్ రోడ్డు నిర్మాణం, కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో రెండు వరుసల రహదారితో పాటు సెంట్రల్ లైటింగ్, వెన్నంపల్లి రింగ్ రోడ్డు నిర్మాణానికి సుల్తానాబాద్ లో మంత్రులు శంకుస్థాపన చేయనున్నట్లు వారు తెలిపారు.
కాల్వ శ్రీరాంపూర్ మండల ప్రజలు పెద్ద మొత్తంలో తరలివెళ్లి బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బంగారి రమేష్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు, మాదాసి సతీష్,కల్వల శ్యామ్, మొండయ్య, తదితరులు ఉన్నారు.




