Sultanabad: సుల్తానాబాద్ 500 మందికి పైగా చిన్నారులకు మెడల్స్ అందజేత!
Sultanabad: చిన్నారుల్లో భక్తి భావం పెంపొందించేందుకే ఈ కార్యక్రమాలు: యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్. సుల్తానాబాద్‌లో చిన్నారులకు సత్కారం.
Sultanabad: సుల్తానాబాద్ 500 మందికి పైగా చిన్నారులకు మెడల్స్ అందజేత!
సుల్తానాబాద్: ఆధునిక యుగంలో చిన్నారుల్లో చిన్నతనం నుంచే భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక దృక్పథాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్ అన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రముఖ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 10 సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులు "జైశ్రీరామ్" అని 516 సార్లు రాసినందుకు గాను, వారిని అభినందిస్తూ ఫౌండేషన్ తరఫున ప్రశంసా పత్రాలతో పాటు మెడల్స్ అందజేశారు.
విశేష స్పందన.. 500 మందికి పైగా చిన్నారులు భాగస్వామ్యం!
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. స్వల్ప కాలంలోనే ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. సుమారు 500 మందికి పైగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని "జైశ్రీరామ్" అని రాశారని తెలిపారు. పాల్గొన్న ప్రతి చిన్నారికీ విడతల వారీగా మెడల్స్, సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు.
రాబోయే రోజుల్లో 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు కూడా మరిన్ని ఆధ్యాత్మిక, భక్తి పెంపొందించే పోటీలు, కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. పలువురు ప్రముఖుల భాగస్వామ్యం.
ఈ విశేష కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సమత కుమార్, న్యూ హరిజన్ స్కూల్ ప్రిన్సిపాల్ స్వప్న, మెగా బ్లడ్ డోనర్ గాలిపల్లి కుమార్, యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులు చిలగాని విశ్వనాథ్, తుమ్మని శాంత్, గుంటి రాకేష్, రమేష్, శివలతో పాటు పెద్ద సంఖ్యలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.




