Manthani: మంథనిలో నిప్పుల కుంపటి.. మంట లేకుండానే రోడ్డుపై ఆమ్లెట్
Manthani: పెద్దపల్లి జిల్లా మంథనిలో భానుడి భగభగలు. 44 డిగ్రీల ఎండ తీవ్రతకు మంట లేకుండానే రోడ్డుపై ఆమ్లెట్ వేసి చూపించిన శ్రీపాద కాలనీ యువకులు.
Manthani: మంథనిలో నిప్పుల కుంపటి.. మంట లేకుండానే రోడ్డుపై ఆమ్లెట్
Manthani: ఎండ తీవ్రత 44 డిగ్రీలు, ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే జంకుతున్న ప్రజలు.. ఎండ ఇంత ప్రమాదకరంగా ఉందో మంట లేకుండానే ఎండలో ఎగ్ ఆమ్లెట్ రోడ్డుపై వేసి చూపించిన యువకులు. పెద్దపల్లి జిల్లా మంథనిలో రెండు రోజుల నుండి విపరీతమైన ఎండ వేడిగాలులు తీవ్రంగా ఇస్తున్నాయి. ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే జనాలు జంకుతున్నారు. ఇంట్లో ఫ్యాన్ లు వేసుకుని ఉన్నా కూడా తీవ్రమైన వేడికి జనాలు అయోమయం అవుతున్నారు.
మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీపాద కాలనీలో కొంతమంది యువకులు రోడ్డు పక్కన ఓ బెంచ్ పైన కోడి గుడ్డు పగలగొట్టి మంట, నూనె లేకుండానే ఆమ్లెట్ వేశారు. అది చూసిన జనాలు ఆశ్చర్యానికి గురయ్యారు. పగటి సమయంలో 44% ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో, రోడ్డు ఉపరితలం చాలా వేడెక్కింది. దీనిని చూపించడానికి యువకులు రోడ్డుపై గుడ్డు పగలగొట్టి ఆమ్లెట్ వేసి చూపించారు. కొద్ది నిమిషాల్లోనే గుడ్డు ఉడికిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత ఆమ్లెట్ ని యువకులు తిన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యువకులు జనాలకు సూచించారు.




