Gangadhara: గట్టు బూత్కూరులో రైతుల ఆవేదన.. కాంటాలు లేక ఇబ్బందులు

Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టు బూత్కూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సందర్శించారు.

N. Madhusudan Reddy, Karimnagar
Updated on: 25 April 2026 3:16 PM IST
Gangadhara
X

Gangadhara: గట్టు బూత్కూరులో రైతుల ఆవేదన.. కాంటాలు లేక ఇబ్బందులు

Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టు బూత్కూరు గ్రామంలో శనివారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రాలను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ‘తూ తూ మంత్రం’గా సాగుతోందని, కనీస వసతులు కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. పంటలు చేతికి వచ్చి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు వేసి రోజుల తరబడి వేచి చూస్తున్నా, కాంటాలు (తూకం) సకాలంలో జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ అన్నదాతపై ప్రభుత్వం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. సాగునీరు అందించకుండా లక్షల ఎకరాలను ఎండబెట్టి, ఇప్పుడు రైతుల చేతికి వచ్చిన కొద్దిపాటి పంటలను కూడా కొనకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు.

చొప్పదండి నియోజకవర్గం వ్యాప్తంగా గత 25 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభాలతోనే సరిపెట్టారని, మిల్లర్లకు అలాట్మెంట్ లేక కొనుగోళ్లు ముందుకు సాగడం లేదని అన్నారు. కాంటాలు వేయడం లేదని, వడ్లు కొనడం లేదని, సన్నాల కొనుగోళ్లు కూడా నిలిచిపోయాయని తెలిపారు.

ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనుగోలు చేయకపోవడంతో మిల్లర్లు, దళారుల చేతిలో రైతులు నష్టపోతున్నారని, మద్దతు ధర కూడా అందని ద్రాక్షగా మారిందని విమర్శించారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో కే. చంద్రశేఖర్ రావు హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు నీరందించి, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి, వారం రోజుల్లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని గుర్తు చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని, లేకపోతే పాలుపేరు మీద కోతలు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story