Karimnagar: రైతుల జోలికొస్తే ఊరుకోం.. ప్రభుత్వానికి సుంకె రవిశంకర్ వార్నింగ్!

Karimnagar: గంగాధరలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మీడియా సమావేశం.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 20 Jun 2026 1:38 PM IST
Karimnagar
X

Karimnagar: రైతుల జోలికొస్తే ఊరుకోం.. ప్రభుత్వానికి సుంకె రవిశంకర్ వార్నింగ్!

కరీంనగర్ జిల్లా: గంగాధర మండలం మధుర్‌నగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని, రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయడంతో పాటు రైతు భీమా ప్రీమియంను ప్రభుత్వం చెల్లించాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, రైతుబంధు, రైతు భీమా అమలులో నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

రైతు వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story