Pegadapalli: సన్‌షైన్ స్కూల్‌లో ‘సూర్యకిరణోత్సవం’ సందడి

Pegadapalli: పెగడపల్లి సన్‌షైన్ స్కూల్ వార్షికోత్సవం ‘సూర్యకిరణోత్సవం’ ఘనంగా నిర్వహణ. విద్యార్థుల దశావతారం నృత్యం మరియు తండ్రిపై నాటిక ఆకట్టుకున్నాయి.

Srimanthula Kondal, Peddapalli
Published on: 24 April 2026 7:36 PM IST
Pegadapalli
X

Pegadapalli: సన్‌షైన్ స్కూల్‌లో ‘సూర్యకిరణోత్సవం’ సందడి

Pegadapalli: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం, పెగడపల్లి గ్రామంలోని సన్‌షైన్ స్కూల్ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు హాజరై విద్యార్థుల ప్రతిభను ఆస్వాదించారు. కార్యక్రమ స్థలం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించింది.

ఈ వేడుకలో ముఖ్య ఆకర్షణగా స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన మ్యాజిక్ షో నిలిచింది. ఈ ప్రదర్శన పిల్లలతో పాటు తల్లిదండ్రులను కూడా ఆకట్టుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నవ్వులు, చప్పట్లు, ఆనందంతో కార్యక్రమం మరింత రంగులీనింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కూల్ కరస్పాండెంట్ సయ్యద్ నసీర్, పెగడపల్లి ఉప సర్పంచ్ పత్తి శ్రీనివాసరెడ్డిఆశనపల్లి సర్పంచ్ మోహన్ , నంసంపల్లి సర్పంచ్ ప్రభాకర్ , మంగపేట సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. వారి సమక్షం కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చింది.

ఈ సందర్భంగా కరస్పాండెంట్ సయ్యద్ నసీర్ మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం స్కూల్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. డిజిటల్ క్లాసులు, అబాకస్ శిక్షణ, లూసిడా హ్యాండ్‌రైటింగ్, కరాటే తరగతులు వంటి ఆధునిక విధానాలను ప్రవేశపెట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నైపుణ్యాలను పెంపొందిస్తున్నామని చెప్పారు.

తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు రూపుదిద్దుకోవడంలో తల్లిదండ్రులు కూడా స్కూల్‌తో కలిసి పనిచేయాలని, ప్రతి విషయంలో పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. “పిల్లలకు ఎప్పటికప్పుడు ప్రేరణ అవసరం. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కలిసి పనిచేస్తే పిల్లల భవిష్యత్తు మరింత వెలుగొందుతుంది” అని అన్నారు.

విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. దశావతారం నృత్యం సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించగా, తండ్రి భావాన్ని ప్రతిబింబించే నాటిక ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. నాటిక చూసిన ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ వార్షికోత్సవం వినోదం, సంస్కృతి, విలువల సమ్మేళనంగా నిలిచింది. ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల కృషి ఈ విజయవంతమైన కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది.

ఈ కార్యక్రమంలో పెగడపల్లి వార్డు సభ్యులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న సన్‌షైన్ స్కూల్ మరోసారి తన ప్రతిబద్ధతను చాటుకుంది.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story