Peddapalli: కాల్వ శ్రీరాంపూర్‌లో ఎరువుల షాపులపై విజిలెన్స్ తనిఖీలు!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో విజిలెన్స్ అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Peddapalli: కాల్వ శ్రీరాంపూర్‌లో ఎరువుల షాపులపై విజిలెన్స్ తనిఖీలు!
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ విజిలన్స్ ఎంక్వయిరీలో భాగంగా మండలంలోని 'అన్నదాత ఫర్టిలైజర్ షాప్' ను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో భాగంగా దుకాణంలోని ఎరువుల నిల్వలు (స్టాక్), రికార్డుల ప్రకారం ఉన్న స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వం నిబంధనల ప్రకారం అందిస్తున్న ఈ-పాస్ (EPOS) మిషన్ లావాదేవీలను, మొబైల్ యాప్‌లో నమోదైన నిల్వల వివరాలను సరిచూశారు. రికార్డులలో ఉన్న నిల్వలకు, దుకాణంలో ఉన్న నిల్వలకు సరిపోయిందా లేదా అనే కోణంలో తనిఖీలు చేపట్టారు.
రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని, ఎలాంటి అక్రమాలకు పాల్పడినా, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి బ్లాక్ మార్కెట్‌కు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.
ఈ ఉమ్మడి తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్పీ సీతారెడ్డి, సీఐ అనిల్, తహసీల్దార్ దినేష్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి (AO) సంధ్య మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




