Sircilla: సిరిసిల్లలో ‘స్వచ్ఛత హి సేవ’ పోస్టర్ ఆవిష్కరణ!

Sircilla: సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛత హి సేవ పోస్టర్‌ను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి. పర్యావరణ పరిరక్షణపై పిలుపు.

KALEEM, SIRICILLA
Published on: 19 Sept 2026 4:12 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో ‘స్వచ్ఛత హి సేవ’ పోస్టర్ ఆవిష్కరణ!

Sircilla: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ఛత హి సేవ (పరిశుభ్రతయే సేవ) కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరినీ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలనే భావనను బలోపేతం చేయడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

“మన ఊరు పరిశుభ్రత.. మన బాధ్యత” అనే భావనను ప్రతి ఒక్కరిలో పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

రాబోయే వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు, ప్రజలు సహజమైన పువ్వులు, రంగులను మాత్రమే వినియోగించాలని సూచించారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ పువ్వులు, కెమికల్ రంగులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదన్నారు.

వినాయకుడికి ప్రతిరోజూ నిర్వహించే పూజల్లో ఉపయోగించిన పువ్వులు, ఇతర పూజా సామగ్రిని నీటిలో వేయకుండా సంబంధిత మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా స్వచ్ఛతపై తన సందేశాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, విప్ బుర్ర మల్లికార్జున్, కౌన్సిలర్ సభ్యులు బూర బాలు, ఎర్రం వెంకట్రాజ్యం, మొగిలి నాగరాజు, కూర భాగ్యలక్ష్మి దేవరాజ్, ఎలుక వెంకటేశం, ఆడెపు చంద్రకళ ప్రభాకర్, అడిచెర్ల రూప సాయి కృష్ణ, పాషికంటి రమ్య సత్యనారాయణ, బత్తుల రమేష్, కోఆప్షన్ సభ్యుడు నంది శంకర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA