Ramagundam: సోమగూడెంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ మెరుపుదాడి
Ramagundam: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెంలో అర్ధరాత్రి పేకాట స్థావరంపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేశారు.
Ramagundam: సోమగూడెంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ మెరుపుదాడి
రామగుండము: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెంలో ఓ ఇంట్లో పేకాట స్థావరంపై రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది దాడీ చేశారు. ఈ సంఘటనలో ఐదుగురు పట్టుబడ్డారు.
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం గ్రామంలోని ఓ ఇంటిలో నగదును పందెంగా పెట్టి పేకాట నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్దరాత్రే పోలీసులు ఆ ఇంటిపై మెరుపుదాడి చేశారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 52 పేక ముక్కలు, రూ.1,10,630 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు,వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం కాసిపేట పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
Next Story




