Sircilla: శాఖల వారీ నివేదికలు సిద్ధం చేయాలన్న కలెక్టర్ గరిమ అగ్రవాల్!

Sircilla: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్‌ సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 18 July 2026 10:15 PM IST
Sircilla
X

Sircilla: శాఖల వారీ నివేదికలు సిద్ధం చేయాలన్న కలెక్టర్ గరిమ అగ్రవాల్!

సిరిసిల్ల: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నందున అన్ని శాఖల అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.

హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూపర్ ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ నివారణ చర్యలు, వ్యవసాయ ప్రణాళికలు, తాగునీటి నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహిస్తూ అవసరమైన విత్తనాలు, సాంకేతిక సూచనలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి జిల్లా ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శాఖల వారీ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని, వ్యవసాయం, తాగునీరు, పశుసంవర్ధక, విద్యుత్, వైద్య, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, ప్రత్యేక అధికారులతో జరిగే సమీక్ష సమావేశాలకు అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికలతో హాజరుకావాలని ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులతో సమీక్ష నిర్వహించి, ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శాఖల వారీగా పూర్తి వివరాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story