Kokapet: పద్మశాలి ఆత్మగౌరవ భవనానికి కోకాపేటలో రెండు ఎకరాల భూమి కేటాయింపు
Kokapet: హైదరాబాద్ కోకాపేటలో పద్మశాలి ఆత్మగౌరవ భవనానికి 2 ఎకరాల భూమి, రూ.5 కోట్ల నిధులను కేటాయిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రొసీడింగ్స్ అందజేశారు.
Kokapet: పద్మశాలి ఆత్మగౌరవ భవనానికి కోకాపేటలో రెండు ఎకరాల భూమి కేటాయింపు
Kokapet: పద్మశాలి సామాజిక వర్గ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో భవన నిర్మాణం కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు, నిర్మాణ పనుల కోసం రూ.5 కోట్ల నిధులను విడుదల చేసింది.
ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పద్మశాలి సంఘాల ప్రతినిధులకు భూమి కేటాయింపు, నిధుల విడుదలకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిర్ణయం పట్ల పద్మశాలి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆత్మగౌరవ భవనం పద్మశాలి సామాజిక వర్గ ఐక్యతకు, అభ్యున్నతికి, సామాజిక గుర్తింపునకు ప్రతీకగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ, పద్మశాలి సంఘం తెలంగాణ ప్రాంత అధ్యక్షులు కాపర్తి మురళి, తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకట నారాయణ, కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్న కైలాస్ నేత, పీసీసీ ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీశ్వర్‌తో పాటు పలువురు పద్మశాలి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.




