Sircilla: క్రిస్మస్ వేడుకలకు ఒక్కో చర్చికి రూ.30 వేల ఆర్థిక సాయం: మైనారిటీ శాఖ!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్రిస్మస్ వేడుకల కోసం 50 చర్చిలకు రూ.30 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు మైనారిటీ అధికారి జయస్రి తెలిపారు. నవంబర్ 30 ఆఖరు.

KALEEM, SIRICILLA
Published on: 23 Nov 2026 4:28 PM IST
Sircilla
X

Sircilla: క్రిస్మస్ వేడుకలకు ఒక్కో చర్చికి రూ.30 వేల ఆర్థిక సాయం: మైనారిటీ శాఖ!

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్రిస్మస్ వేడుకల నిర్వహణ కోసం చర్చిలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. చర్చిలకు సున్నం వేయడం, విద్యుత్ దీపాలంకరణ కోసం ఒక్కో చర్చికి రూ.30 వేల చొప్పున ఆర్థిక సహాయం మంజూరు చేయనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి గొట్టే జయస్రి తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందని, ఈ నేపథ్యంలో పండుగను వైభవంగా జరుపుకునేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 50 అర్హత కలిగిన చర్చిలకు ఈ సహాయం అందించనున్నారు.

అర్హత కలిగిన, నమోదిత చర్చిలు నవంబర్ 23 నుంచి 30వ తేదీ వరకు "tgobmms.cgg.gov.in" (https://tgobmms.cgg.gov.in) వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించిన అనంతరం ప్రింట్ తీసుకుని చర్చి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, నిర్వహణ కమిటీ తీర్మానం, బ్యాంక్ పాస్‌బుక్ లేదా క్యాన్సిల్డ్ చెక్, పాస్టర్ లేదా అధ్యక్షుడు లేదా కార్యదర్శి ఆధార్ కార్డు, చర్చి తాజా ఫొటోలు, నిధులను సున్నం వేయడానికి, దీపాలంకరణకు మాత్రమే వినియోగిస్తామని అండర్‌టేకింగ్ జతచేసి నవంబర్ 30లోగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

గడువు దాటిన, అసంపూర్తి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. జిల్లాలోని పాస్టర్లు, చర్చి కమిటీ సభ్యులు, క్రైస్తవ సామాజిక నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గొట్టే జయస్రి కోరారు. మరిన్ని వివరాలకు 9949910328 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA