Palle Narasimha: మే 25, 26న ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలు.. కళాకారులను ఆదుకోవాలని పల్లె నర్సింహ డిమాండ్!
Palle Narasimha: మే 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లో తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి.
Palle Narasimha: మే 25, 26న ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలు.. కళాకారులను ఆదుకోవాలని పల్లె నర్సింహ డిమాండ్!
కరీంనగర్: ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ అనుబంధమైన తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలు మే 25,26వ తేదీలలో రెండు రోజుల పాటు హైదారాబాద్ లో జరిగనున్నాయని ఆ మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ కళాకారులకు పిలుపునిచ్చారు.
సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణా శిబిరం ఆదివారం ముగిసింది.
కళాకారులకు పల్లె నర్సింహ పాటలు పాడటం, డప్పు కొట్టడం శిక్షణ ఇచ్చారు.
శిక్షణ ముగింపు సందర్భంగా పల్లె నర్సింహ మాట్లాడుతూ దేశంలో ఎంతో మంది మేధావులు, రచయితలు,కవులు,కళాకారులు కలిసి ఇప్టా స్థాపించారని,కార్మిక,కర్షక,ప్రజా సమస్యలపై,వారి జీవనవిధానాలపై నిరంతరం అధ్యయనం చేస్తూ అనేక రచనలు చేస్తున్నారని,పాటలు వ్రాస్తున్నారన్నారు. కళాకారులు ఎంతో మంది ఉంటారు, కానీ ప్రజా కళాకారులు కొంత మంది మాత్రమే ఉంటారని అలాంటి కళాకారులు నిత్యం ప్రజల బాధలను చూసి వాటిని ప్రపంచానికి తెలిజేసేందుకు పాటలు పాడుతుంటారని,కళ కాసుల కోసం కాదు ప్రజల కోసమని పాడే కళాకారులే ప్రజానాట్య మండలి వారని,అలాంటి కళాకారులు నిత్య విద్యార్థులుగా ఎన్నో విషయాలు తెలుసుకొని,పాటలు వ్రాస్తూ,పాడాలని అందుకు ఇలాంటి శిక్షణా శిబిరాలు ఉపయోగపడతాయని నర్సింహ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎంతో కళాకారులు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జానపద,యక్షగాన,బుర్ర కథ,ఒగ్గు కథ, వీధి బాగోత కళారుల బ్రతుకులు చాలా దుర్భరంగా ఉన్నాయని ప్రభుత్వం వారిని గుర్తించాలని,అన్ని రంగాల కళాకారులను గుర్తించినవారికి గుర్తింపు కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నర్సింహ కోరారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల కష్ట,సుఖాలను పాటల రూపంలో బయటకు తెచ్చి ఎంతో మందిని మెప్పించే అత్యంత బలమైన ఆయుధం పాట అని,గాయకుడు నాయకుడు అవుతాడు. కానీ నాయకుడు గాయకుడు కావడం చాలా కష్టమన్నారు.
ఏ పోరాటాలు,ఉద్యమాలు,బహిరంగ సభలు విజయవంతం కావాలన్నా కళాకారులు ఉండాల్సిందేనని, కళాకారులగా తయారయ్యే వారికి తోడ్పాటు అందించడం కోసం సిపిఐ జిల్లా సమితి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు.
ఈ శిక్షణా శిబిరం కార్యక్రమంలో ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవ్వంపల్లి స్వామి, మాజీ జడ్పీటీసీ అందె స్వామి,ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి దుడ్డేల సమ్మయ్య,,ఉమ్మడి జిల్లా కళాకారులు లెనిన్,వరకోలు సదానందం,కోమల, సరిత,రమ, ఏ.రాజయ్య,విజయ్, తిరుపతి,లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.




